Blog bagundaaa

Friday, June 27, 2008

C(R)ASH coaching

భూమి సూర్యుడి చుట్టునె ఎందుకు తిరుగుతుంది.? పగలు అవగానె రాత్రి ఎందుకు వస్తుంది..? గాలే ఎందుకు పీలవాలి..అన్నం పీల్చి, గాలి తినొచ్చు కదా..? అని ప్రతి ఒక్కరు ఎన్నొ సార్లు మనలొ మనల్ని ప్రశ్నించు కుంటూ ఉంటాం... ఏప్పుడైన,“ఇది చాలా ఇంటెల్లిజెంట్ క్వస్చన్, గట్టిగా అడిగితె, మనల్ని కూడా ఆ ఇంటెల్లిజెంట్ కోవ లొ కి చెరుస్తారేమొ" అనే... ఎదవ ఆలొచన కలిగినప్పుడు.. విజయ గర్వంతొ.. కచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం తెలియదు, అనుకున్న వారిని అడుగుతాం.వెంటనే...దూరం నుండి..ఒక బొంగురు పోయిన స్వరం,మాట వనుకుతూ...“అది విధి ధర్మం నాయనా“ అనటం వినిపిస్తుంది. Indirect గా,’ఎక్కువ ఆలొచించక మూసుకొని కూర్చో రా పూల చొక్కా’ అని అంతరార్థం…

అలాగే, చిన్నపటి నుండి 7th అయిపోయాక 8th, దాని తరువాత 9th then 10th చదవటం అనేది విధి ధర్మం.ఎప్పుడు కూడా,ఎందుకు వెళుతున్నాం అనే doubt మనసులొ.. sorry మెదడులో..(మనసులో ఏదో ఒక heroine అప్పటికే చోటు సంపాధించు కొని ఉంటుంది) ఏ మూలనా తొచదు.

కానీ……

10th అవ్వగానే, Intermediate ఎందుకు చదువుతున్నావ్ అంటె,వెంటనె.. EAMCET అని Border లో సైనికుడు JAIHIND చెప్పే రేంజ్ లో చెప్తాం. "ఒకే సంవత్సరం లో 3 years డిగ్రీ చేయిస్తాం" అనే CRASH colleges లాగా, Intermediate లేకుండానే EAMCET రాయిస్తాం అనే రోజు కుడా ఈ క్షణికమైన జీవితం లో చూస్తాం అనే నమ్మకం నాకుంది.

ఇలాగే ఇంటర్మిడియట్ అవ్వగానె " శ్రీమన్నారయణ ట్రస్ట్" వారి " గొవిందా గోవింద" కాలెజి లో SHORTEST TERM కోచింగ్ ( పది రోజులు) చేరాను. రెండేళ్ళ ఇంటర్మీడిఎట్ సిల్లబస్ ని కాచి, వడ పోసి, మోహినీ అమ్రుతం పంచినట్టు, డాన్స్ చేసుకుంటూ లెక్చరర్స్ మాకు పంచుతారు అనుకున్నా. శ్రీహరి కోట దగ్గరే అవటం వలన ఆ కోచింగ్ లొ నేర్చుకున్న ఘ్నానంతొ, వెంటనే మమ్మల్ని రాకెట్ లొ విహారయాత్రకి కూడా పంపుతారు అనె ప్రఘాఢ నమ్మకం. కానీ పది రోజుల్లొ, ఎన్నొ జీవిత రహస్యాలు, విధి ధర్మాలు, ప్రపంచం లొ నిక్షిప్తమై ఉన్న సమస్యలు (ప్రొబ్లెంస్)ని ఎలా నేర్చుకొవాలి. "చాలా కష్టమే మాస్టారు!" అనుకున్నా. నాకు కాదు కష్టం,కోర్స్ చెప్పే మాస్టార్లకి.
---------------------------------------

ఎలాగోలా,కాలెజీకి చేరాము,నేను మా నాన్న.ఆ కాలెజ్ అడ్రెస్ చెప్పి ఆటొ అడిగితె ,రెండు లక్షల రూపాయలు అడిగాడు! ఆటొ కొనటానికి కాదు నాయనా,అని చెప్పి మళ్ళి అడిగా.ఈ సారి మూడు లక్షలు చెప్పాడు.విసుగొచ్చి ఊరు బాగా తెలిసినవాడి లా," ఏముంది,ఇలా వెళ్ళి,అలా తిరిగి,అలా వచ్చి అక్కడ టక్కున ఆగితె అదెగా గొవిందా గోవింద కాలెజ్?" అన్నా.అంతటితో ఆగక, పక్కనె ఉన్న నాన్నని చూసి బ్రహ్మనందం లా కనుబొమ్మలు ఎగురవెస్తు "ఎలా చేసా?" అన్నట్టు నవ్వా.నాన్న కళ్ళలొ పుత్రొత్సాహం మాత్రమె కాక, ఆనందభాష్పాలు కూడా కనిపిచ్చాయి.



ఆటో వాడు ఏమీ మాట్లాడకుండా,ఒక పేపర్,పెన్ తీసి,నేను చెప్పిన రూట్ ని అలాగే పేపర్ మీద వేసాడు.రిజల్ట్ చూసి,మా నాన్న ఆశ్చర్య-ఆవెశాలకి లోనయ్యాడు. ఆటో వాడు సునామి ల ముంచుకొచ్చిన నవ్వుతొ " ఛీ,ఇలాంటి నవ్వులొ చఛ్ఛి పోఇనా పరవాలెదు" అన్నట్టు ఆపుకోకుండా నవ్వుతున్నాడు.ఏమి జరిగిందా అని పేపర్లోకి చుస్తే,నా ప్లాన్ ప్రకారం వెలితె మళ్ళి ఉన్నచొటుకె వస్తాం అని అపుడు అర్థం అయింధి!!!
---------------------------------------
ఆటో కాలెజ్ కి చేరువవుతుండగా..
భిన్ లాడెన్ ఏర్పాటు చేసిన విమానం వారి మీదకి దూసుకు వచినా సరే, కొంచెం కూడా జరగని(జరగలేని)అంతమంది జనసందోహం.చిరంజీవి పార్టి ప్రచారాలు మొదలు పెట్టాడో..లేక ఐశ్వర్య,అభిషెక్ ఫ్యామిలి తమకి పుట్ట బోయె పిల్లలకి కోచింగ్ సీట్ రిజర్వు చేసుకోడానికి వచారేమో అనుకున్నా.
కాదు,అక్షరాల SHORTEST termలొ చేరబోయె పిల్లలు…వారి తల్లిదండ్రులు,వారి వారి తల్లిదండ్రులు,పక్కింటి వాళ్ళు ,అందరూ వచారు,అదేదో వనభొజనాలకి వచినట్టు!!
ఆ ప్రజా ప్రవాహం లో ఈదుకుంటూ వెళ్ళటం ఎలాగా అని ఆలోచించి,కురు సార్వభౌముడికి మాయామహల్ లో జరిగిన అవమానం లా,ఆటో వాడి దగ్గర నాకు కలిగిన భంగపాటుని గుర్తు తెచ్చుకొని,ఈసారి తెలివి ప్రదర్సించటంలొ తగు జాగర్త వహిస్తూ,గట్టీగా "జీహాద్" అని అరిచా..!!ఒక్కసారి అందరూ బాంబు పేలుడు కళ్ళరా చుసే భాగ్యందక్కినట్టు..ఎక్కడ..ఎక్కడ అంటూ ఉత్సాహంతొ పక్కకి జరిగారు.ఆ సైకిల్ గాప్లొ,నేనూ మా నాన్న క్యాష్ కౌంటర్ దగరికి వెళ్ళాము,ఫీస్ చెల్లించేదానికి.
Swiss bankలో కూడా అలాంటి latest technology equipment ఉపయొగించరేమో,ఇక్కడ మాత్రం Automatic cash counters, Fake currency detectors వాడుతున్నcash clerksని చూసి సంభ్రమాశ్చర్యాలు చెందా.దీనికే ఇంత సెటప్ ఉంది అంటే..కోచింగ్ తేసుకున్నాక శ్రీహరికోటలో నా స్పేస్ ట్రిప్ గ్యారంటీ అనుకున్నా.
కాలేజ్ బయట reading pad and chair కొందాం అని వెళ్ళా.షాప్ ముందు క్యూలో నిలబడటానికి టోకెన్ ఇచ్చారు!! ఆస్థులు అమ్మి ఫీస్ కట్టగా, నాలాంటి ధనవంతులు ఆటో వాడికి సమర్పించుకొగా,మిగిలిన డబ్బులు,కచ్చితంగా సరిపోవు అని,ఆ షాప్ వాడు credit card facility and సులభ వాయిదా పద్దతి లో లోన్ కుడా ఇచ్చాడు.
---------------------------
Formalities అయ్యాక బయటికి వచ్చాము.
అప్పంగింతల్లొ,అమ్మాయిని వదిలి వెలుతున్నట్టు,అమ్మాయిల పేరెంట్స్ జాగర్తలు చెప్తూ ఏడుస్తున్నారు."ఏమిటి, వారం రొజులకే??!!!! అబ్బాయిల పేరెంట్స్ ఐతే “ఇంటికెళ్ళాక మన మామయ్య ఆస్థి అమ్మి నీ ఆకాశ విహారానికి కావల్సిన స్పేస్ సూట్ పంపుతానాయనా..”అని ధైర్యం చెపుతున్నారు. వారి sentiments తొ influence అయిన మా నాన్న కుడా,ఏడవటానికి ప్రయత్నిస్తుండగా…
" నాన్నా, దానికి ఇంకా టైం ఉంది, ఇలాంటివి అన్ని ఇంజనీరింగ్ సీట్ రానప్పుడు పెట్టుకుందాం లే, అప్పుడు కావాలంటే నెనూ మీతో కలిసి ఏడుస్తాలే" అని చెప్పి, నాన్నని పంపించా.
ఒక్కసారి గట్టిగా గాలి పీల్చి, నాకు allocate చేసిన హాస్టల్ వైపుగా నడిచా..
సశేషం: నా కోచింగ్ హాస్యాలు, రహస్యాలు నా నెక్స్ట్ పోస్ట్ లో చెప్పుకుందాం.
సభకి నమస్కారం...
గమనిక: నా మొదటి పోస్ట్ లొ ఎమన్నా తెలుగు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న, నన్ను క్షమించి, మా తెలుగు మాస్తారుని తిట్టగలరు.