Blog bagundaaa

Tuesday, July 1, 2008

C(R)ASH Coaching-part 2

నాతో , మరి కొందరు ముందే తెలిసిన స్నేహితులు ఉండటంతో, హాస్టల్ లో ఒక్కడినే అవుతానేమో అనే భయం నాలో కొంచెం తగ్గింది.హాస్టల్ రూమ్ లోకి అడుగుపెట్టాను. డాక్టర్స్, నర్సులు మాత్రమే లేరు, హాస్పిటల్ కి కావలసిన లక్షణాలు అన్ని ఉన్నాయా హాస్టల్ లో.వరుస క్రమం లో ఎర్పరచిన బెడ్లూ,ఇల్లు వదిలి వచ్చాము అని ఒక్క రోజుకె పేషంట్స్ లా అయిన స్టూడెంట్స్ పక్కన భ్రెడ్లూ,సందేహం లేకుండా గవర్నమెంటు హాస్పిటల్ని తలపిస్తున్నాయి.గర్ల్ ఫ్రెండ్స్ లేని వారు,తమ భావాలు పంచుకోడానికి,వారి మనసుల్లొ ఉన్న హీరోయిన్ల పోస్తర్ల ని గోడలకేక్కించారు.

ఇంతలో..”నావల్ల కాదు బాబొయ్..నేను ఇంక మోయలేను ఈ భారాన్ని” అని పురిటినొప్పులు పడుతున్న యువతిలా ఏదో స్వరం వినిపించింది. ఏవరా అని చూస్తే..గోడకి తగిలించిన హేంగర్ మాట్లాడుతోంది..ఒక్కొక్క హుక్కుకీ ఇదు జీన్స్ ప్యాంట్లకి తగ్గకుండా తగిలించి ఉన్నాయి!! చిన్నగా నవ్వుకొని,రూంలొ సెటిల్ అయ్యా.

----------------------------

డిన్నర్ బెల్లు కొట్టారు,స్నేహితులమందరం కలిసి భొజనానికి వెళ్ళాం. "Struggle for Survival" అంటే ఏంటో అప్పుడు తెలిసింది.జైల్లోలా ప్లేట్లు పట్టుకొని నిలబడిఉన్నారు.ఒక బ్యాచ్ భొంచేస్తూ ఉండగానే,క్యూలో నిలబడి ఉన్న స్నేహితులు కళ్ళతో X-Ray బుకింగ్ చేసుకుంటున్నారు,"అ ఫ్యాన్ కింద సీట్ నాది,ఆ కిటికీ పక్క సీట్ నాది" అని.తినేవారెవరూ పల్లెత్తు మాటకూడా మాట్లాడకుండా తింటున్నారు.వారి క్రమశిక్షణ చూసి ఆశ్చర్యపోయా.కాసేపటికి డిస్కవరీ చానెల్లొ చూపించే UFO (గ్రహాంతర వాసుల విమానం)లా ఉండే ఒక పదార్థాన్ని తెచ్చి వేసారు.

మెనూ లో చూస్తే..దాన్ని "చపాతి" అంటారు అని తేలింది.ఒక ముక్క నోట్లో పెట్టుకోగానే,నోరు మూత పడింది,కళ్ళు పెద్దవయ్యాయి.శివుడు గరళాన్ని గొంతువరకైనా మింగగలిగాడు.కాని ఈ UFOని నేను అక్కడి వరకు కూడా మింగలేక పొయాను.అప్పుడు అర్థం అయింది,ఎందుకు అందరూ అంత క్రమశిక్షణతొ మాట్లడకుండా తింటున్నారో అని.!!

స్నేహితుడు ఒకడు రెండు UFO(చపాతి)లని తీసి దాచెసాడు.వాడి ఆకలికి,ధైర్యానికి నివ్వెరపోయి,ఎందుకు?అని అడిగా.ఇంటికెళ్ళి Flying Disc ఆడుకుంటాడట వాటితొ..!!
రేపటి నా మొదటి క్లాస్ గురించి ఆలోచిస్తూ పడుకున్నా.

----------------------------------

ప్రొద్దుటే లేచి, మొహాలూ..అవీ..ఇవి కడుక్కొని..(అవి,ఇవి అంటె...ఏవి??),బ్రేక్ ఫాస్ట్, ఫాస్ట్ గా ముగించుకొని,క్లాస్ కి వెళ్ళాము.మా తదుపరి వారం రోజులు ఎలా ఉండబోతాయో ఒక మాస్టారు వివరించాడు.

ప్రతి టాపిక్ కి ఒక స్పెషలిస్ట్ లెక్చరర్,ప్రతి లెక్చరర్ కి ఒక ప్రత్యేకమైన శైలి.ఒకరికి ఠక్కున సమాధానం చెబితే కోపం,మరొకరికి చెప్పకపోతే కోపం.Physics lecturer అయితె,"ఒక మనిషి వేగంగా నడిచి వెలుతూ ఉన్నాడు"అనేది ప్రాక్టికల్ గా చూపించాలి అని నడుస్తూ బయటికి వెళ్ళి,మళ్ళీ తిరిగి రానే లేదు!!!ఇలా తమదైన శైలిలో అందరూ మాకు పాఠాలు చెప్పేవారు.

రాత్రి హాస్టల్ కి వచ్చాక,ఆ రోజు విశేషాలన్ని గోడకి వేలాడుతున్న "కల్పనా రాయి" పోస్టర్ కి చెప్పుకొనేవాన్ని.

-------------------------

ఎంసెట్ మనవల్ల కాదు,మెనేజ్ మెంట్ కోటాలో సీట్ తెచ్చుకుందాం,అనుకున్న r'itch' స్నేహితులు కొందరు మమ్మల్ని సినిమాకి వెల్దాము అని ప్రోద్భలపరిచారు.సహారా ఎడారిలాంటి మా జీవితం లొ “జీన్స్” సినిమా నూతన ఉత్సాహన్ని నింపుతుంది అని నమ్మి,వారితో జతకట్టాం.

పర్మిషన్ తీసుకోందే ఇంటికి కూడా పంపరు,ఇక సినిమాకేం పంపుతారు? అందుకని,మా స్నేహితుడు ఒకనికి, నోటితో చెప్పుకోలేని వ్యాధి వచింది,డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాము అని,పది మంది పర్మిషన్ అడిగాము.మీరు ఊహించినట్టుగానే…సినిమాలో హీరో యాక్సిడెంట్ అయిన వార్త వినగానె..హీరోయిన్ అరిచినట్టు,”నో.....” అని మా వార్డెన్ గట్టిగా అరిచి తిరస్కరించాడు.

సినిమాలోని కల్పనా రాయ్ "రా..రా.." అని పిలుస్తున్నట్టు అనిపించి,మేమందరం కంచె దూకాం.కంచెకి చిక్కుకొని..జీన్స్ ప్యాంట్స్ చించుకొని,జీన్స్ సినిమా చూసేదానికి హాల్ కి చేరాము.నలభై రోజులు నిరాహార దీక్ష చేసి,విరమణ రోజు నిమ్మకాయ జ్యూసు తాగినట్టనిపిచ్చింది, సినిమాచూస్తున్నంతసేపు.

ఇంటర్వెల్ లో...అప్పటికే బాగా ముదిరిన మా స్నేహితుడు ఒకడు సిగరెట్టు వెలిగిద్దామని,పక్కనే ఉన్నతన్ని,”మాస్టారు, అగ్గిపెట్టె ఉంటే ఇస్తారా?”అని అడిగాడు.థాంక్స్ చెపుదామని అగ్గిపుల్ల వెలుగులొ తలెత్తి చూస్తే..అయన మా లెక్కల మాస్టారు..!!! ఇక సినిమా సంగతి మరచి,బయటపడ్డాము.
రాత్రి 12గంటలు అవటంతొ,బస్సులు లేక అటుగా వెళుతున్న ట్రాక్టర్ ఎక్కి కాలేజి దగ్గర దిగాం.మళ్ళీ కంచె దూకుతుండగా, వెళ్ళేటప్పుడు చినిగిన మా జీన్స్ వాసన చుసి పసిగట్టిన కుక్కలు..మమ్మల్ని చుసి కుక్కల్లా మొరిగాయి!! ఆ రాత్రి పొదలలో రాళ్ళ కోసం వెతికే ధైర్యం లేక,కాళ్ళకి పని చెప్పి స్ప్రింట్ రన్నర్స్ లాగ కళ్ళు మూసుకొని పరిగెట్టాం.కళ్ళు తెరిచి చూసేసరికి,ఎదురుగ్గా..వార్డెన్ !!కానీ చీర కట్టుకొని ఉన్నాడు.! మాలాంటి వారిని పట్టుకోటానికి మారువేషంలొ తిరుగుతున్నాడేమో అనుకున్నాము.కాదు…నిజంగానే ఆడ-వార్డెన్.ఆపుడర్థం అయ్యింది…
మేము దూకింది లేడీస్ హాస్టల్ కంచె అని..!!!!
--------------------------------
మిగిలిన స్తూడెంట్స్ అందరికి…రాత్రి ఏదో జరిగింది అని తెలిసింది కానీ..ఎం జరిగిందో ఎవ్వరికీ తెలియలేదు..
లెక్కల మాస్టారు ఎప్పుడు వస్తాడా అని మా స్నేహితులం అందరం ఆత్రంగా ఎదురుచూస్తుండగా..అయన రానే వచాడు.
కాసేపు పాఠం చెప్పాక..“ఈ మధ్య పిల్లలు బాగా చెడిపోయారు…అఖరికి,మాస్టార్లనే..సినెమాలో సిగరెట్టు కి అగ్గిపెట్టె అడిగే స్థాయికి చెరారు(దిగజారరు)” అన్నాడువెంటనీ మా స్నేహితుడు లేచి, “మాస్టారు…అది మీరనుకోలేదండి..!!”అన్నాడు.
అంతదాకా వాడెవరో తెలియని వారికి కూడా అప్పుడు వాడెవడో తెలిసిపోయింది..!!!!