Blog bagundaaa

Tuesday, March 24, 2009

అమీరులను చేసే అమీర్ పేట్

చూస్తుండగా Engineering నాలుగేళ్లు హ్యాపీ డేస్ సినిమాలో లాగా అయిపోయింది.... US వెళ్ళాలి అని english మీద కసరత్తు పట్టి GRE రాసాను. పరదేశి యానానికి రంగం సిద్దంగా ఉన్నపుడు...నా బ్రతుకులో యముడిలా OSAMA BIN LADEN తగలడ్డాడు .Twin towers ని విమానం తో కూల్చి..US వెళ్దామన్న నా ఆశా సౌధన్ని అమాంతంగా కుల్చేసాడు ..

"ఇండియా లో ఉండటం కన్నా మించిన ఆనందం ఇంకోటి ఉండదు" అని అందరికీ లెక్చర్ ఇచ్చి... CAT,MAT,RAT,BAT లాంటి rhythemic గా ఉన్న అన్ని MBA exams రాసేశాను. MBA సీట్ వచ్చింది...exams అన్నీ ఎదోలా మ్యానేజ్ చేసి మ్యానేజర్స్ అయిపోయాం అని...పుస్తకాలు చించి గాల్లోకి విసిరేశాము..
తర్వాత ఏంటి...??
--------------------

Hyderabad cafe లో ఇరానీ ఛాయ్ తాగుతూ, నేను,నా లానే వీధిలో పడ్డ ఒక ఫ్రెండ్, ఉద్యోగాల గురించి చర్చిస్తున్నాం,...వాడు “ఇప్పుడు SOFT-WHERE చాలా బాగుంది” అనగానే నేను WHERE అని అడిగా...
AMEERPET అన్నాడు గట్టిగా...!!! అంతే....

AMEERPET....AMEERPET....AMEERPET అని రీసౌండ్ వచ్చింది.మా చుట్టూ ఉన్న వాళ్ళంతా తినడం...తాగడం...వాగడం అన్నీ ఆపేసి, మాకేసి చూసి ”ఆ..!!” అంటూ అశ్చర్యంగా చూసారు.ఒక్క సారి నాకు doubt వచ్చి “ ఏంట్రా ..........అదేమన్నా బూతా!!!! అన్నా........ వాడు వెంటనే......కాదు రా.......... మన లాంటి వాళ్ళకు లక్షలు వచ్చే లక్షణమైన ఉద్యొగం ఇచ్చే బంగారు బాతు అన్నాడు...

సీన్ కట్ చేస్తే..

నల్ల కోటు వేసుకొని, ఆకుపచ్చ టై కట్టుకొని..నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని...బోర్డ్ రూం లో ఇరవై మంది కంపెనీ హెడ్ ల ముందు...భరతనాట్యం భంగిమలు చేస్తూ స్క్రీన్ ముందు నిల్చుని ఏదో presentation ఇస్తున్న నేను,
మళ్ళీ సీన్ కట్ చేస్తే.......

హైదరాబాద్ సెంట్రల్ లో.. నేను వస్తూ ఉంటే...నేను ఇచ్చిన డబ్బుల తో తిని బాగా బలిసిన నా బాడీ గార్డ్స్ ఇద్దరు , నాకన్నా ముందు వెళుతూ..“జరగండి..జరగండి...ఆయన వస్తున్నాడు...ఆయన వస్తున్నాడు....” అనుకుంటూ customersని పక్కకి జరుపుతున్నారు. నేను ఆ షాప్స్ లో.... రాయలసీమ రామన్న చౌదరి వేలు పెట్టి భూమి ని కబ్జా చేసినట్టు...ఏ Rack పక్క వేలు చూపితే దానిలో ఉన్న shirts and pants అన్నిటినీ ఇంకో ముగ్గురు assistants trolleys లోకి వేసేస్తున్నారు. బిల్ కట్టడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళి, ప్లేయింగ్ కార్డ్స్ లా పట్టుకొచ్చిన నా credit cards కట్టని తీసి కౌంటర్ లో చూపించా....వాడు దాన్లో నుండి కళ్ళు మూసుకొని ఒకటి తీసుకొని టేబుల్ మొత్తం బరికి, తిరిగి కార్డ్ ఇచ్చేసాడు...ఒక హీరో నవ్వు నవ్వి...” హుహ్..!! ఉంచుకో” అన్నా..!! బాషా సినిమాలో లా.....వాడు వెంటనే నా చేతి మీద ముద్దు పెట్టి ఆనంద భాష్పాలు రాల్చాడు..

మళ్ళి సీన్ కట్ చేద్దామనుకుంటూ ఉంటే...... ఎవడో మొహాన నీళ్ళు చల్లాడు....చూస్తే..నా టేబుల్ ఎదురుగా ఉన్న మా ఫ్రెండ్ ........ పైన ఊహించుకున్న సీన్లకి నా ఛాతి ముందుకు ఎగిసి, ముందున్న నా టేబుల్ ని తోసి వాడి మీద టీ పడేలా చేసిందట!!! అందుకు కక్ష తీర్చుకున్నాడు
తేరుకొని...... వెంటనే డిసైడ్ అయిపొయా......... No more AMERICA.......only AMEERPET అని..!!!
-------------XXXXXXX----------XXXXXXX--------
అమీర్ పేట్ ఎక్కడో కనుక్కొని అక్కడికి చేరా. President లేదా Prime Minister వస్తున్నాడు అన్నా కూడా అన్ని బ్యానర్లు కట్టరేమో.......అక్కడ ప్రతి బిల్డింగ్ బ్యానర్ల తో కప్పేసి ఉంది ,కొర్స్ పేర్లతో. రోడ్ మీద నడుస్తూ వెళుతుంటే .....మొహాన ఫెఢేల్..... !! అని పేపర్ల కట్ట తో కొట్టాడు ఒకడు.ఏంటా అని ఆ పాంప్లెట్ ని చూసా.... “ Microsoft OS 2015 version training in 15 days” అని రాసుంది....!!! ఛా.... ఇక్కడ కూడా CRASH course లు తప్పేట్టు లేవే అనుకున్నా. రోడ్ అంతా కప్పేసిన ఆ పాంప్లెట్ లని తొక్కుకుంటూ వెళ్ళా...

లొపలికెల్లి కౌన్సెల్లింగ్ కి కూర్చున్నా..నా బఓడేట అడిగాడు ..మాట్లాడుతుండగ ..ఎదో చెతికి చీమ కుట్టినట్టు ఐంది..ఎంటాని చుస్తే ..ఎవడో సూది తో నా బ్లడ్ తీసుకుంటున్నాడు. “ భయపడకు, నీ బ్లడ్ గ్రూప్, HIV టెస్ట్స్ ఇంకా కొన్ని చెక్ చెయాలి అందుకె ” అన్నాడు . మరో మాట మాట్లాడే లోపే . నా date and time of birth అడిగాడు . ఇచ్చి చెయ్యి రుద్దుకొని తల పైకెత్తగానే ..”నీ జాతకం ప్రకరం నీకు ఇంకో 5 నెలల్లో రుచిక మహా పురుష యొగం ఉంది. కొత్త ఉద్యొగం లో చేరతావు . లక్షలు సంపాదిస్తావు . సెంట్రల్ లో షాపింగ్ చెస్తావ్ , బోర్ద్ రూం లొ మీటింగ్స్ ఇస్తావ్ . ఇంకాసెపట్లొ ఈ ఇన్స్టిట్యుట్ లో చేరతవ్ . నీవి అనుకుంటున్న , నీవి కాని, ఆ పొకెట్ లో ఉన్న పది వేలు ఇక్కడ ఫీస్ లాగా కట్టెస్తావ్ ” అన్నాడు..!!! hypnotize చేసినట్టు వెంటనే కట్టెసి కొర్స్ లో చేరిపోయా.
-------------XXXXXX------------------XXXXXX----------------
First day of my class, ఒక 6 బాథ్రూం ఫ్లాట్ ని ఇన్స్టిటుట్ లా మలిచారు. జంతర్ మంతర్ లా ఉన్న ఆ రూంస్ ని వెతుక్కుంటూ వెళ్తే మా క్లాస్స్ రూం వచ్చింది . ఆన్నీ నీల్ కమల్ కుర్చీలే. కాస్త తీక్షనంగా గమనిస్తే అన్నిటికి రెండే కాళ్ళు ఉన్నాయి !! ఏందుకా అనుకుంటున్నారు కదా?? ఒక కుర్చీని ఇంకొ కుర్చీ కి అనిచ్చి..లాస్ట్ కుర్చీని గొడకి ఆనిచ్చారు..స్పేస్ మనేజ్మెంట్ అంట..!! మెల్లిగా జనాలు రావటం మొదలెట్టారు , చుస్తుండగానె బయట CLASS FULL బోర్డ్ పెట్టారు . ఒకరి భుజాన ఒకరు చేతులెసుకొని, చైర్స్ ని, మమ్మల్ని బాలెన్సె చెసుకుంటూ జాగ్రత్త గా కుర్చున్నాం.

కాసేపటికి “ వస్తున్నా…వస్తున్నా” అనుకుంటూ వి.వి.వస్తావు మస్టర్ వచ్చెసాడు. పది నీల్ కమల్ చైర్స్ ఒకదాని మీద ఒకటి వేసున్నాయి మా ఎదురుగా...... సర్ ఒక్క ఉదుటున సొమర్ సాల్ట్ కొట్టి టాప్ మోస్ట్ కుర్చీలో కుర్చున్నాడు . ఆ ఫీట్ చూసి క్లాస్స్ అంతా కరతాళ ధ్వనులతో మారు మ్రోగి పోయింది. ఆంజనేయుడు లంక సభ లో రావణుడి ముందు తోక చుట్టుకొని కుర్చున్న అనుభవం కలిగి మాకు గగుర్పాటు కలిగింది.

సార్,తను పుట్టేప్పుడు వాళ్ళ అమ్మ పడ్డ పురుటి నొప్పులని చూసి..తను పడ్డ బాధల నుండి మొదలెట్టి, టామి హిల్ఫిగర్ అండర్వేర్ కొనుక్కొలేక పోయాడు అని,అమ్మాయి సంబంధం రిజెక్ట్ చేసిన బాధల వరకు చెప్పాడు. అలాంటి బాధలు మాకు ఉండకూడదు అని, ఇలాంటి ప్రజాసేవ చెస్తున్నాను అని విన్నపించుకున్నడు.

ఇంతలో టెంత్ ఫెయిల్ అయ్యి,కంప్యూటర్స్ రిపెయిర్,సాఫ్ట్ వెర్ ఇన్స్టాలెషన్ చేసి..నేనూ BASIS CONSULTANT నే అని చెప్పుకునే,వాల్ల తమ్ముడు వచ్చి.." అన్నయ్యా,మొన్న మీరు సంబంధం చూసిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు,ముందు బ్యాచ్ స్తూడెంట్ అట,మీరు మసి పూసి మారెడుకాయ..హిప్నాటిజం చేసి డబ్బులు దొబ్బేస్తున్నారని తెలుసుకొని..సంబంధం క్యాన్సెల్ అని TV9 లో చెప్పడం ఇప్పుడే విన్నా" అనేశాడు.
వెంటనే అంత ఎత్తు నుండి దూకితె..ఈ సారి అమ్మాయి తనకి కాళ్ళు విరిగాయని రిజెక్ట్ చేస్తుందేమో అనే భయంతొనేమో..అలాగే చైర్స్ మేదే కూర్చొని..”ఆ స్తూడెంట్ పేరు కనుక్కొని…కంపనీస్ అన్నిటికి Black Listed Resume అని చెప్పి పంపేసేయి వాడిది“ అన్నాడు కోపంగా.

ఒక్క సారి కొంత మంది స్తూడెంట్స్ మొహాలపై చెమటలు పట్టడం గమనించా.. తర్వాత తెలిసింది వాల్లందరికీ అక్కలు ఉన్నారు అని…!!

--------xxx--------------------xxx------------

తన నోటి నుండి వచ్చే ప్రతి మాటని,రన్నింగ్ నొట్స్ పేరిట మా చేత పుస్తకాల్లో అచ్చు వేయించేవాడు.ఫ్లొ ని ఫాలొ అయిపోతూ ఎన్నో సార్లు,తనకి తుమ్ము వచ్చినా,దగ్గు వచ్చినా,వాటిని కూడా ఏదో స్పెల్లింగ్స్ తొ బుక్స్ లొ రాసుకొనే వాల్లం. " O.K. See you tomorrow " అంటె దాన్ని కూడా రాసుకొనెవాళ్ళం..!! బోర్డ్ మీద రంగు రంగు స్కెచ్ పెన్స్ తొ స్కేల్ పెట్టుకొని మరీ ఫ్లొ చార్ట్స్ వేసేవాడు.అంతా అయ్యాక బోర్డ్ బాటం రైట్ కార్నర్ లో "వి.వి.ఆర్ట్స్"అని గీకి గర్వంగా మాకేసి చూసేవాడు.

క్లాస్ కి ఎంత లేట్ గా వచ్చినా..ప్రతి రోజు నా పక్కన ఎప్పుడూ ఒకే అబ్బాయి కూర్చునేవాడు.సార్ చెప్పటం మానేసినా తెగా రాసేసేవాడు.ఎంట్రా అని అడిగితె,తను త్వరలో తీయబోయె "కప్లింగ్ మె ధడ ధడ పువ్వు" అనె సినిమా కి స్క్రిప్ట్ రాసుకుంటున్నాడట..! "ఛీ..ఇలాంటి వాల్లతొనే కదా మా అమ్మ మాట్లాదవద్దు అన్నది" అనుకొని తన పిల్లి కళ్ళకేసి అసహ్యంగా చూసా.కాని నాలో కూడా ఉన్న కళాకారుడు ఉండబట్టలేక,తనని "చిట్టి గారు, మీ సినిమాలో heroine బాగుంటుందా? లేక వ్యాంప్ బాగుంటుందా? " అని అడిగా.ఎందుకూ..అని అడిగే లొపే "ఎం లేదు,హీరోయిన్ బాగుంటె హీరో క్యారక్టర్,వ్యాంప్ బాగుంటె విల్లన్ క్యారక్టర్ చెద్దామని" అన్నా."సరే తమ్ముడు" అని తనిచ్చిన భరోసాకి..ఒక్క సారి "బాబూ చిట్టి......" అని ఏడుస్తూ ఆలింగనం చేసుకోవాలనిపిచింది
స్టూడెంట్స్ లో జాబ్ కొడతామన్న ఆత్మ విశ్వాసం నింపడానికి వి.వి.గారు ఎంచుకున్న మార్గం అమోఘం. క్లాస్ జరుగుతుండగా, సార్ కి ఒక సారి"సై...సర సర సై...సై..."అనే రింగ్ టొన్ తొ ఒక కాల్ వచ్చింది.క్లాస్ లొనే కాల్ లిఫ్ట్ చేసి"ఆహ్..సుధాకర్..చెప్పు...ఎక్కడ..?ఎంటి..AAKU PUNCTURE MNC లో జాబ్ కొట్టావా..వావ్..నెలకి నాలుగు లక్షలా.!!వెంటనే Honalulu లొ onsite assignment ఆహ్.!!అబ్బే..నాదేముంది చెప్పు.అంతా నీ హార్డ్ వర్క్ వల్లే.ఉంటా మరి"అని చెప్పి కాల్ కట్ చేసి,స్తూడెంట్స్ కేసి చూడగానే...

R.Narayana Murthy దేశభక్తి సినిమా తీసి...దాన్లో వంద మంది తెల్లదొరల తలలను,కట్ట బ్రహ్మన్న కత్తితొ ఒకే ఉదుటిన నరికేసాక..ఎలాగయితె పూనకం వచ్చినట్టు ఊగి పోతాడో..అలా ఊగుతున్నారు స్తుడెంట్స్ అంతా.అంత దాకా స్క్రిప్ట్ రాసుకుంటున్న చిట్టి కి ఎమైందో ఎమో కానీ..ఒక్కసారిగా లేచి..

"సా..ర్..Interview లు పెట్టండి సా..ర్..వెంటనే..పెట్టండి సార్..ప్లీజ్..తల..తల ..తల పగిలిపొయెలా..నరాలు చిట్లి పొయేలా ఉన్నాయి సార్.." అంటూ..ఊగిపోతున్నాడు. చేతిలో చార్మీ ఫొటో పెడితే కాని తగ్గలేదు ఆ పూనకం.


తర్వాత ఎప్పుడో కనుక్కుంటే తెలిసింది..ఆ సుధాకర్ కాల్, గత మూడేళ్ళుగా ప్రతి బ్యాచ్ లో వస్తుందని.ఆ చేసేది కుడా ఎవరో కాదు..వాళ్ళ తమ్ముడు..Basis Consultant ఏ అని.

కొన్ని రోజుల తర్వాత..

సార్..ఇప్పటిలో ఉద్యొగం రాదు అనుకున్న,నాకు..చిట్టి కే,అందరికన్నా మొదట జాబ్స్ వచాయి.క్రుతఘ్నతా భావం తొ సార్ కి పూలు,పండ్లు,పళ్ళెం లో తీసుకెళ్ళం.ఎక్కడ గురు దక్షిన గా తన బ్రొటన వేలు అడుకుతాడో.. అని చిట్టి తన రెండు చేతులకు కట్లు కట్టుకొని వచ్చాడు.సార్ కి బొట్టు పెట్టి,సంభావన సమర్పించుకొన్నాం ఇద్దరం. మమ్మల్ని చూసి సార్ కి కలిగిన గురువోత్సాహం చూసి మా కళ్ళు చెమ్మగిల్లాయి.

అదే అనందం తో తిరిగి వెళ్తూ.....అక్కడే ఉన్న ఒక స్టూడెంట్ ని పిలిచి..ఎగతాలిగా..”ఏంటి ఇంకా..సుధాకర్ కాల్స్ వస్తున్నాయా క్లాస్ లో?“ అన్నాం…

“వస్తున్నాయండి.......కానీ సుధాకర్ పేరు మీద కాదు..పవన్ లేదా చిట్టి పేరు మీద..” అన్నాడు..!!!!!!!!
----------------------------------------------

గమనిక: పై పోస్ట్ లో ఎవన్నా తెలుగు తప్పులు ఉండిన..మా తెలుగు మాస్టర్ ని..అనువాద తప్పులు కాని అచ్చు తప్పులు కాని ఉండిన..ఈ పొస్ట్ ని తెలుగు లోకి తర్జుమా చేసి,నాకు ఎంతగానో సహాయ పడిన నా స్నె-హితురాలు క్యూటి ని తిట్టగలరు..!!